గురుదేవ్ రబీ౦ద్రనాథ్ టాగోర్- " గోరా నవలలోని
ఓ సాదృశ్య వీచిక "
ఓ సాదృశ్య వీచిక "
స్టీమరు పై భాగము మీదనుంచిపాదాలు వణుకుతుండగా లలిత గది దగ్గరికి వచ్చి ద్వారము వద్ద నిలుచుని ఆ హేమంత ప్రత్యూశ సమయాన ఆ అంధకార జడిత అపరిచిత నదీ దృశ్యము మధ్య ఒంటిగా నిద్రపోతున్న వినయుని వైపు చూస్తున్నది. ఎదుట దిక్ ప్రాంతాన నక్షత్రాలు అతని నిద్రను పరివేష్టించి ఉన్నవి. అనిర్వచనీయమైన గాంభీర్యములో , మాధుర్యములో ఆమె హృదయము కన్నీటితో నిండిపోయింది. ఆ సంగతి ఆమెకు తెలియదు. తన తండ్రి వద్ద ఆమె ఉపాసనా క్రమము నేర్చుకున్నది. ఉపాసనా దేవత ఈనాడు దక్షిణ హస్తముతో ఆమెను స్పృశించింది. నది పైన ఆ తరుపల్లవ నిబిడమై నిద్రితమైన తీరాన అంధకారముతో పాటు నవీన కాంతి తొలిసారి నిగూఢముగా సమ్మేళనము పొందినపుడు ఆ పవిత్ర సంధి క్షణములో పరిపూర్ణ నక్షత్ర సభలో ఏదో దివ్య సంగీతము అనాహాత మహావీణ మీద ఆపరాని ఆనంద వేదన వలె మోగింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి