చలం కథానిక "ప్రేమపర్యవసానం" లోని స్త్రీ కట్టినమైన తెగింపుకు సున్నితమైన కారణాల సాదృశ్య విశ్లేషణా వీచిక
స్త్రీలకు చాలామందికి తెలీదు లోకమంటే ఏమిటో తెలీని పంజరాలలో పెరగడం వల్ల , లోకం ఆకర్షణీయమైన వింత రంగుల్లో కనపడుతుంది . కటకటాల మధ్యనుంచి , సామాన్య పదార్ధం కూడా అసాధారణ లావణ్యాన్ని ప్రదర్శిస్తుంది.వాళ్ళ నేత్రాలకి హృదయంలో తమ ప్రపంచం...............పుస్తకాలు ,వార్తలూ , సినిమాలు ............. ప్రేరేపపణలకు తట్టుకోలేక సామాన్య దినచర్య జీవరహితంగా తోచి స్వేచ్చకోసం పెనుగులాడి , తపనపడి, పంజరం లోంచి నిప్పుగుండంలోకి అమాంతం దూకుతారు.
మానవ హృదయం కావడం చేత తమకు జీవితం ప్రసాదించని అదృష్టాల కోసం కలలు కని, ఆశలు పడి ఈ కుటుంబ ఆటంకాలూ, ఈ సంఘ నిబంధనలూ, ప్రేమించేవారి అభ్యంతరాలు తమని బంధిస్తున్నాయని భావించి స్వర్గమూ, సౌందర్యమూ ఆ ఇంటి అవతల పక్కన, ఆ రోడ్డు దాటితే చాలు, సమస్త అనుభవాలూ తమ కోసం కాచుకుని వున్నాయని ధ్యానించుకుంటారు. దీనికంతా ఈ వాస్తవ ప్రపంచాన్ని చిత్రించని కథలూ, నాటకాలూ కారణం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి