30, మే 2012, బుధవారం

                గోరా నవలలోని ఒక అంతర్గత ఘర్షణా సాదృశ్య వీచిక 



             అటు తరువాత సుచరిత తన పడక గదిలోకి వెళ్లి తలుపు మూసుకుని   కూర్చోని ఒక్కసారి గోరా మాటలు తోసివేయవలనని యత్నించింది . కాని ఆ బుధి కుశలత , విశ్వాసము చేత , ఉద్దీప్థమైన మొఖము ఆమె కన్నుల ఎదుట కట్టినట్టే ఉన్నది. గోరా మాటలు చిట్టి మాటలు కావు. అవి కేవలము గోరావి ఆ మాటలకు ఆకారము ఉన్నది , గతి ఉన్నది , చైతన్యము ఉన్నది - అవి విశ్వాస బలముతో స్వదేశ ప్రేమతో వేదనతో నిండి ఉన్నవని ఆమెకు తోస్తున్నది .ఆ మాటలు ప్రతివానికి లోబడి పోయ్యేవి కావు. వాటిలో మానవత్వం ఉన్నది . అది సంపూర్ణ మానవత్వం ,అసామాన్య మానవత్వం . అతనిని తోసిపారవేయడానికి వీలు కాదు - ఈ ద్వందంలో పడి సుచరిత నలిగిపోయింది . ఆమె కళ్ళ వెంట నీరు తిరుగుతున్నది . తనను అపూర్వమైన ఈ గొప్ప వైరుధ్యములో ఎవరో పడవేసి పూర్తిగా ఔదాసీన్యముతో  అనాయాసంగా  దూరంగా  వెళ్ళగలిగినారని  భావించింది. ఆమె హృదయము భద్దలైతే పోతే బాగుండుననిపించింది. బాధగా ఉన్నదని తనను తాను ని౦ది౦చుకోన్నది.