16, జులై 2023, ఆదివారం

o' pelli katha SV3

 ఒక సాదృశ్య వీచిక


                      ఈ సంఘమనేది ఇలాంటి ఉక్కు చట్రంలా  ఉందని ఇది వరకు నేను గమనించలేదు ,  దాన్ని ఎదురించలేదు గనక . ఈ మహా యంత్రంలో మనిషి ఒక చిన్న మేకు . తనకుగా నిర్ణీతమైన పనిని నిర్వర్తించాల్సిందే . సంఘపు బరువుతో ప్రతి మనిషి కృంగిపోయి మారిపోవాల్సిందే . సొంత ఆలోచనలు ఉండకూడదు . 

                 ఈ అన్యాయం లోనుంచీ బరువు విరక్తులోనుంచీ లీలగా ఒక జ్ఞాపకం తొంగి చూసేది . అక్కడే నాకు ఆలోచించడానికీ , మనసు వికసించడానికీ ,  అవకాశం దొరికింది . ఈ బరువు అక్కడ  లేదు . అక్కడ స్వేచ్ఛ ఆనందం అనుభవించాను .నేను అక్కడే ఉండాల్సిందేమో అనుకుంటాను .కానీ అంత్తలోనే అది మోసమూ  అబద్ధమూ  కదా అని జ్ఞాపకం వస్తుంది .......  


o pelli katha sv 2

  మానవ సంబంధాన్ని నిర్వచించే మనో గగన వీచిక 

జాలి: అవును, ఈ పరిస్థితుల్లో కృష్ణను గురించి నాకు ఉన్న భావమే అది, జాలి అనేది నీచమైందని ఎలా అనుకున్నానప్పుడు ?అది ప్రేమ వాత్సల్యాల కంటే తక్కువైంది ఏమి కాదు 

నిజానికి అన్నీ మనిషికీ మనిషికీ మధ్య నుండే 

సంబంధాన్ని నిర్వచించేవే . అన్నీ పేర్లు . ఉండేది, నిజమైంది,  సంబంధం మొక్కటే . తల్లికి బిడ్డ మీద ఉండేది ప్రేమ వాత్సల్యం . బిడ్డ కింద పడి దెబ్బ తగిలించుకుంటే కలిగేది జాలి . బిడ్డ తప్పు చేసినప్పుడు కలిగేది విసుగు , కోపం. అందంగా కనిపించినప్పుడూ , పసితనాన్ని ప్రస్ఫుటం చేసుకుంటున్నప్పుడూ ముద్దు , అన్నీ ఆ ఒక్క సంబందాన్నుంచీ విభిన్న  పరిస్థితుల్లో కలుగుతున్నవే . 

   రచయిత్రి : ఆర్ వసుంధరా దేవి                        నవల : ఓ పెళ్లి కథ             ప్రచురణ : విజయ మాస పత్రిక                         తేదీ : ఫిబ్రవరి 1977    




1, ఆగస్టు 2021, ఆదివారం

A beautiful depiction of How to Forgive .... from Code EZRA novel by Gay Courter

 "There are two parts to forgiveness", Eli's mother once said after there had been a terrible fight between him and his father. Displeased by Eli's refusal to instantly obey some order Hugo had taken a precious toy drum and hurled it across the room, smashing it. Eli has never forgotten his anger at the moment. It had exploded inside his head, his eyes had seen crimson, then black. He had pummeled his father's chest with impotent fists and had been half dragged, half carried to his room, where he had sobbed himself into an aching state of semiconsciousness. 

Later his mother had come in with a glass of juice. After one sip he gagged. 

His mother rubbed his back and spoke in a voice as smooth as treacle. "The first part is the most difficult. you must throw away the black feeling ."

How had she defined it so precisely?

"Give it away. Refuse to allow it to remain in your life. It is like doing surgery on yourself - a painful, yet necessary step."

" I don't think I ...." he moaned 

"You have great strength. call on it now. you will surprise yourself ."

"Have you ever done it ?"

"Forgiven someone ?"

"Yes" 

"Many times"

"Your own Papa?" 

"Yes"

"What did he do?"

"That is not important ." Her eyes had starred off in the distance. "Living with someone is a constant series of small reprieves. Most are inconsequential."(trivial)

"My drum is not inconsequential".

"No, I understand that ."She was very quiet. 

Finally, he whispered,

"What is the second part ?"

"The hardest, actually you must help the person who hurt you overcome his own feelings of culpability.

"What do you mean?" 

" Your father needs to tell him not to feel so upset with himself."

"I don't want to do that."

"That is why it is so difficult. If you do not do anything about it, the discord is not over, and unless it is finished, unless the circle is closed, the problem will linger. Both parties will continue to suffer. You are the only one with the power to put an end to it."

"But how?"

"By accepting your part in the blame."

"I did not throw the drum ."

"No, but you provoked your father."

Eli had seen her point . She had left him alone to sort it out and it was not until the afternoon of the next day that he had found the words - and the courage - to tell his father he was no longer angry. 


25, జులై 2021, ఆదివారం

o pelli katha sv 1

 ఓ పెళ్లి కథ లోని గాఢమైన ఒక సాదృశ్య వీచిక 

"ఒక మనిషి వ్యక్తిత్వం రూపు దిద్దుకోవటానికి కీలకమైన సంఘటన కనుక్కోవడానికి,' నీ మొట్ట మొదటి జ్ఞాపకం ఏమిటి?' అని అడుగుతారట . నా మొట్ట మొదటి జ్ఞాపకం -  చచ్చిపోతున్న అమ్మ నన్ను దగ్గరకు తీసుకోవాలన్న తీవ్రమైన కోరికతో చేతులు ముందుకు చాచి, అంతలోనే అది నాకు ఫ్రమాదకరమన్న గ్రహింపుతో వెనక్కు తీసుకోవటం.  నిరాశతో, నిస్పృహతో నెమ్మదిగా వెనక్కు వాలిపోయిన అమ్మ చేతులే నా మొట్టమొదటి జ్ఞాపకం అనుకుంటాను ... అమ్మ పేరు సీతమ్మ ... " అన్నాడు. 

ఇటువంటి జ్ఞాపకం కీలకంగా ఏర్పడిన కృష్ణ మనస్తత్వం జీవితంలోని దుఃఖానికి , సత్యానికి చేరువలో ఉండటంలో ఆశ్చర్యం లేదు . 

"నీ మొట్టమొదటి జ్ఞాపకం ఏమిటో చెప్పు ?" అన్నాడు కొంచం సేపు ఆలోచించి," నేను నల్లగా పుట్టినందుకు నన్ను చంపేయమని అమ్మకు కాంతమ్మ పెద్దమ్మ సలహా ఇవ్వడం ..." అన్నాను. 

కృష్ణ ఒక్క క్షణం నిరుత్తరుడయ్యాడు. గబుక్కున నా చెయ్యి గట్టిగా పట్టుకుని నవ్వుతూ , " కాని నీవు బ్రతికే ఉండటం నిజం... ఎందుకు బాధ ?" అన్నాడు. "కానీ నేను బాధపడటం నిజం ... అదే బాధ " అన్నాను . ఇద్దరం నవ్వటం మొదలెట్టాం. అకారణంగా చాలా సేపు నవ్వాము..... ఆ నవ్వు వ్యాపించి వ్యాపించి ప్రపంచాన్ని రంగుల కలగా మార్చేస్తుంది ! ........ 

    రచయిత్రి : ఆర్ వసుంధరా దేవి                                          నవల : ఓ పెళ్లి కథ                                             ప్రచురణ : విజయ మాస పత్రిక                                       తేదీ : ఫిబ్రవరి 1977    


17, జూన్ 2012, ఆదివారం


చలం కథానిక "ప్రేమపర్యవసానం" లోని స్త్రీ కట్టినమైన తెగింపుకు సున్నితమైన కారణాల సాదృశ్య  విశ్లేషణా వీచిక 




స్త్రీలకు చాలామందికి తెలీదు లోకమంటే ఏమిటో తెలీని పంజరాలలో పెరగడం వల్ల , లోకం ఆకర్షణీయమైన వింత  రంగుల్లో కనపడుతుంది . కటకటాల మధ్యనుంచి , సామాన్య పదార్ధం కూడా అసాధారణ లావణ్యాన్ని ప్రదర్శిస్తుంది.వాళ్ళ నేత్రాలకి హృదయంలో తమ ప్రపంచం...............పుస్తకాలు ,వార్తలూ , సినిమాలు .............  ప్రేరేపపణలకు తట్టుకోలేక సామాన్య దినచర్య జీవరహితంగా తోచి స్వేచ్చకోసం పెనుగులాడి , తపనపడి, పంజరం లోంచి నిప్పుగుండంలోకి  అమాంతం దూకుతారు.


మానవ హృదయం కావడం చేత తమకు జీవితం ప్రసాదించని అదృష్టాల కోసం  కలలు కని, ఆశలు పడి ఈ కుటుంబ ఆటంకాలూ, ఈ సంఘ నిబంధనలూ, ప్రేమించేవారి అభ్యంతరాలు తమని బంధిస్తున్నాయని భావించి స్వర్గమూ, సౌందర్యమూ ఆ ఇంటి అవతల పక్కన,  ఆ రోడ్డు దాటితే చాలు, సమస్త అనుభవాలూ  తమ కోసం కాచుకుని వున్నాయని  ధ్యానించుకుంటారు. దీనికంతా ఈ వాస్తవ ప్రపంచాన్ని చిత్రించని  కథలూ,  నాటకాలూ కారణం.       

30, మే 2012, బుధవారం

                గోరా నవలలోని ఒక అంతర్గత ఘర్షణా సాదృశ్య వీచిక 



             అటు తరువాత సుచరిత తన పడక గదిలోకి వెళ్లి తలుపు మూసుకుని   కూర్చోని ఒక్కసారి గోరా మాటలు తోసివేయవలనని యత్నించింది . కాని ఆ బుధి కుశలత , విశ్వాసము చేత , ఉద్దీప్థమైన మొఖము ఆమె కన్నుల ఎదుట కట్టినట్టే ఉన్నది. గోరా మాటలు చిట్టి మాటలు కావు. అవి కేవలము గోరావి ఆ మాటలకు ఆకారము ఉన్నది , గతి ఉన్నది , చైతన్యము ఉన్నది - అవి విశ్వాస బలముతో స్వదేశ ప్రేమతో వేదనతో నిండి ఉన్నవని ఆమెకు తోస్తున్నది .ఆ మాటలు ప్రతివానికి లోబడి పోయ్యేవి కావు. వాటిలో మానవత్వం ఉన్నది . అది సంపూర్ణ మానవత్వం ,అసామాన్య మానవత్వం . అతనిని తోసిపారవేయడానికి వీలు కాదు - ఈ ద్వందంలో పడి సుచరిత నలిగిపోయింది . ఆమె కళ్ళ వెంట నీరు తిరుగుతున్నది . తనను అపూర్వమైన ఈ గొప్ప వైరుధ్యములో ఎవరో పడవేసి పూర్తిగా ఔదాసీన్యముతో  అనాయాసంగా  దూరంగా  వెళ్ళగలిగినారని  భావించింది. ఆమె హృదయము భద్దలైతే పోతే బాగుండుననిపించింది. బాధగా ఉన్నదని తనను తాను ని౦ది౦చుకోన్నది.             

7, నవంబర్ 2011, సోమవారం

     గురుదేవ్ రబీ౦ద్రనాథ్ టాగోర్-  " గోరా నవలలోని
                                             ఓ సాదృశ్య  వీచిక "  


                      స్టీమరు  పై భాగము మీదనుంచిపాదాలు వణుకుతుండగా లలిత గది దగ్గరికి వచ్చి ద్వారము వద్ద నిలుచుని ఆ హేమంత ప్రత్యూశ సమయాన ఆ అంధకార జడిత అపరిచిత నదీ దృశ్యము మధ్య ఒంటిగా నిద్రపోతున్న వినయుని వైపు చూస్తున్నది. ఎదుట దిక్  ప్రాంతాన నక్షత్రాలు అతని నిద్రను పరివేష్టించి ఉన్నవి. అనిర్వచనీయమైన  గాంభీర్యములో , మాధుర్యములో ఆమె హృదయము కన్నీటితో నిండిపోయింది. ఆ సంగతి ఆమెకు  తెలియదు. తన తండ్రి వద్ద ఆమె ఉపాసనా క్రమము నేర్చుకున్నది. ఉపాసనా దేవత ఈనాడు దక్షిణ హస్తముతో ఆమెను స్పృశించింది. నది పైన ఆ తరుపల్లవ నిబిడమై నిద్రితమైన తీరాన అంధకారముతో పాటు నవీన కాంతి తొలిసారి నిగూఢముగా సమ్మేళనము పొందినపుడు  ఆ పవిత్ర సంధి క్షణములో పరిపూర్ణ నక్షత్ర సభలో ఏదో  దివ్య సంగీతము అనాహాత మహావీణ మీద ఆపరాని ఆనంద వేదన వలె మోగింది.